ఉపాసన - ఉపా - దగ్గరగా, ఆసనం వేసుకుని కూర్చోవటం. అమ్మవరినో , అయ్యవారినో ఏదో ఒక కోరిక కోసం లౌకికమో, మోక్షమో ఏదయినా ఒక కోరిక కోసం, అది కావలి అని తీవ్రమయిన నిష్ఠ తో కూర్చుంటారు. ఏ పూజ చేసిన ఆసనం వేసుకోవాలి , దర్భ ఆసనం వేసుకోవాలి.
ఉపాసకులు అంటే నియమం తో ఉండే వాలు. సుభ్రమన్యుడిని ఉపాసించెవాలు, నాగ మంత్రం అనుష్టించేవారు, చేతికి నాగ రక్ష కట్టుకుంటారు. ఎవరి చేత బడితే వారి చేత భోజనం స్వీకరించరు. తాంత్రిక ఉపాసన చేసే వారు నలుపు బొట్టు పెట్టుకుంటారు. శివారాధన చేసే వాలు భస్మం పెట్టుకుంటారు. విష్ణువుని ఆరాధించే వారు నామాలు పెట్టుకుంటారు. సర్వం ఏకం అనుకునే వారు గుండ్రం బొట్టు పెట్టుకుంటారు. అంతా అద్వైతమే అనుకునే వారు గుండ్రం బొట్టు పెట్టుకుంటారు.