ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

నవరాత్రి ఆరాధనా ఎలా చేయాలి?

ఎవరు అయితే కలశ స్థాపన చేసి పూజ చేస్తునారో, శ్రీ విద్యా ఉపాసన ఉన్నవాలు, కుమారి పూజ , సువాసిని పూజ, (వటుక పూజ) వేద బ్రాహ్మణుడికి పూజ చేయాలి. అంటే పాదాలకి పూజ చేయడం , బట్టలు పెట్టడం , భోజనం పెట్టడం వారి అసీర్వచనమ్ తీసుకోవడం. సువాసిని పూజ అంటే సుమంగాలికి , అమ్మవారి ఆరాధకులు అయితే మరి విశేషం ( వారు కూడా నవరాత్రి దీక్ష చేయాలి ) అలాంటి వాలని పిలిచి పూజ చేయాలి. (వారు రోగస్థులు కాకూడదు) . వీరికి 9 రోజులు పూజ చేసి మంగలకరమయిన వస్తువులు అంటే పసుపు , కుంకుమ , నల్ల పూసలు, అద్దం , దువ్వెన , కాటుక డబ్బా , గాజులు ఇచ్చి , రోజు భోజనం పెట్టడం ఇలా రోజు చేసి ఆకరి రోజున వస్త్రాలు పెట్టాలి.