ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

లలిత సహస్రనామాలకి ఉపాసన ఉండాలా ?

లలిత సహస్రనామాలకి నియమం ఏంటి అంటే - 
ప్రతీ నామానికి ముందు బీజక్షరలు చెప్పి తరువాత నమః అని చేయాలి అంటే కనీసమ్ బాల త్రిపుర మంత్ర ఉపదేశం అయిన ఉండాలి. అమ్మవారి ఏదయినా ఒక మంత్రం ఉపదేశం లేకుండా బీజక్షరాలు పలక కూడదు అని నియమం ఉంది. కానీ ఈ మద్య కాలం లో పుస్తకాలు చూసి అందరు చదివేస్తునారు, అది తప్పు. 

కానీ లలిత సహస్రనామాలని స్తోత్రం గా, ఏ మంత్రోపదేశం లేకపోయినా జనులందరూ చదువుకోవచ్చు. అంటే శ్రీమాతా .. శ్రీ మహారాఘ్ని ... శ్రీమత్ సింహసనేస్వరి ... అంటూ నామాలు అందరు చాడువుకోవచ్చు. 

శాంతి కరణ మంత్రాలూ అంటే రోగ నివారణ, అప్పు కోసం , చదువు కోసం చేసుకోవడం వలన ఎవరికీ దోషం ఉండదు కాబట్టి ఈ మంత్రాలూ చేసుకోవచ్చు.