దండకారణ్యంలోని ఇల్వలుడూ, వాతాపీ అనే రాక్షస సోదరులు, అరణ్యంలో వచ్చే పోయేవారిని మాయమాటలతో పిలుచుకు వచ్చి
ఆరగిస్తుంటారు. అతిథి పూజకని భోక్తలను పిలుస్తాడు ఇల్వలుడు. వారురాక ముందే వాటాఆపి
మేకలా మారిపోతాడు. ఇల్వలుడు మేకను కోసి వండి వడ్డిస్తాడు. వాతాపి భోక్తల కడుపు
చీల్చుకుని బయటికి వస్తాడు. ఆ తర్వాత ఎంచక్కా వార్ని ఇద్దరూ కలిసి భుజిస్తారు.
అగస్త్యుడికి ఈ విషయం తెలిసి భోక్తలా వెళతాడు. ఎప్పటిలానే
ఇల్వలుడు వాతాపిని వండి వడ్డిస్తాడు. అగస్త్యుడు భుజించిన తర్వాత ఎప్పటివలె ‘వాతాపీ బైటకిరా’ అంటాడు. అప్పుడు
అగస్త్యుడు ‘ఇంకెక్కడి వాతాపి….ఎప్పుడో జీర్ణమయిపోయాడు. ‘జీర్ణము, జీర్ణము వాతాపి జీర్ణమంటూ’
పొట్టను రుద్దుకుంటాడు. అలా అగస్త్యుడు వాతాపిని
జీర్ణము చేసుకొని ఇల్వలుడిని బూడిద చేస్తాడు. ఎంత చెడు ప్రభావం కలదైనా, అరగనిదయినా అలా అంతే కడుపులో కొండ ఉన్నా అరుగుతుందని తల్లి
నమ్మకము. అందుకనే తల్లి పిల్లలకి భోజనం పెట్టి పూర్తయిన తర్వాత ఆ మాటంటుంది.