పరమేశ్వరుని పూజలకు జిల్లెడూ, గన్నేరూ, మారేడూ, తమ్మి, ఉత్తరేణు ఆకులూ, జమ్మి ఆకులూ, జమ్మి పూలూ,
నల్లకలువాలూ మంచివి.
దాసాని, మంకెన, నదంత, మొగలి మాలతి, కుంకుమ మద్ది…ఈ పూలు పూజకు పనికి
రావు. తొడిమలేని పువ్వులు పూజకు పనికిరావు. తమ్మి పువ్వుకు పట్టింపులేదు. మారేడు
నందు శ్రీమహాలక్ష్మీ, నల్లకలువ నందు పార్వతీ,
తెల్లకలు వనందు కుమారస్వామీ, కమలమునందు పఉంటారు. రమేశ్వరుడూ కొలువై ఉంటారు. అలాగే
చదువులతల్లి సరస్వతీ దేవీ తెల్లజిల్లేడులో, బ్రహ్మ కొండ వాగులో, కరవీరపుష్పంలో గణపతీ, శివమల్లిలో శ్రీమహావిష్ణువూ, సుగంధ పుష్పాలలో గౌరిదేవి ఉంటారు. అలాగే శ్రీమహావిష్ణువుని
అక్షింతలతోనూ, మహాగణపతిని తులసితోనూ,
తమాల వృక్ష పువ్వులతో సరస్వతీ దేవినీ, మల్లెపువ్వులలో భైరవుడిని, తమ్మి పూలతో మహాలక్ష్మినీ, మొగలి పువ్వులతో శివుడ్నీ, మారేడుదళాలలో సూర్యభగవానుడిని ఎట్టిస్థితి లోనూ పూజింపరాదు.