శివలింగం ముందుభాగాన్ని బ్రహ్మదేవుడూ, చివరి భాగాన్ని శ్రీమహావిష్ణువు చూసి రావాలని ఒకసారి పందెము
వేసుకున్నారు. దేవతల సాక్షిగా ఇద్దరూ బయలుదేరారు. బ్రహ్మ ఎంత దూరం వెళ్ళినా
శివలింగం ముందు భాగం కనిపించలేదు. విష్ణువుకు చివరిభాగం కనిపించలేదు. బ్రహ్మ
దేవుడికి మార్గం మచెట్టూ ధ్యలో దేవలోకపు గోవూ, మొగలి చెట్టూ కనిపిస్తాయి.
బ్రహ్మ వారితో తాను శివలింగం ముందు భాగము చూసినట్టు దేవతలకి
సాక్ష్యం చెప్పమంటాడు. బ్రహ్మదేవుడు అడిగితే కాదంటామా అని బ్రహ్మతో కలిసి వెళ్ళి
బ్రహ్మ శివలింగం ముందు భాగం చూశారని సాక్ష్యం చెబుతాయి. దేవతలు నిజమని నమ్మి
బ్రహ్మదేవుడినే విజేతగా ఎంపిక చేస్తారు. ఈలోగా శ్రీమహావిష్ణువు వస్తాడు. అదే
సమయంలో ఆకాశవాణి దేవలోకపు గోవూ, మొగలిపువ్వు అబద్దం
చెప్పాయని తెలియజేస్తాయి. దానితో అసత్యాని పలికిన బ్రహ్మకి పూజలుండవనీ, అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పిన మొగలిపువ్వు పూజకు పనికిరాదనీ,
గోవుముఖము చూస్తే దోషమని శాపము విధించబడినది.