మనిషి ఆయువు తీరిన పదమూడో
రోజు తర్వాత యమభటులు జీవిని యమపురికి తీసుకెళ్తారు. దారి అంతా ఎగుడు దిగుడులు.
ఆకలిదప్పికలు తీరే అవకాశం లేని ప్రాంతంలో అరికాళ్ళు బొబ్బలెత్తినా యమభటులు
కొరడాలతో కొట్టి నడిపిస్తారు. కనుచూపు మేరలోనే నీరు ఉంటుంది. త్రాగబోతే చేతికి
అందదు. మేఘాలు నిరంతరం రక్తాన్ని
వర్షిస్తుంటాయి. అలా పదిహేడు రోజులపాటు, జీవించినపుడు చేసిన
పాపాలను తలచుకుని వాపోతుంటాడు జీవుడు. ఆ తరువాతే యమపురి మజిలీ అయిన సౌమ్యపురం
చేరతాడు.
ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు