ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు

మంగళ చండి పారాయణం ఎవరు చేయాలి?

దుర్గ కి పార్వతి కి మరో పేరు మంగళ చండిక. చండిక రూపం లో త్రిపురాసుర సంహారం చేసింది. మనువంసపు రాజు అమ్మవారిని పూజ చేసాడు. కుజ దోష పోవాలని అమ్మవారిని పూజ చేస్తాం. కుజుడు సాక్షాతూ అమ్మవారిని పూహ చెస్తడు. అమ్మవారిని పూజ చేయడం వలన కుజ దోష నివారణ జరుగుతుంది. 

శత్రువులు పీడ పోవడానికి, ప్రతి ఆడ పిల్ల సుమంగళి గా  , కుజుడి వాళ్ళ రోగాలతో బాద పడేవారు, కుజ దోషం ఉన్న వాలు మంగళ చందికి పూజ చేయాలి. కుజ దోషం పోవడానికి , ప్రతి మంగళవారం , మంగళ చండి పారాయణం , మంగళ చండీ స్తోత్రం చదువుకోవాలి. ముత్తయిదువు కి తాంబూలం ఇవ్వాలి. ఉపవాసం చేసి , సాయంత్రం శివాలయానికి వెళ్లి దీపం పెట్టి , 11 ప్రదక్షిణాలు చేసి , నవగ్రహలకి 7 ప్రదక్షిణాలు చేసి ఎవరికైనా పువ్వు , ఫల్లం దానం చేసి , ఇంటికి వచ్చి అప్పుడు భోజనం చేయాలి. ఇలా చేయటం వలన వారికీ సర్వ మంగలాలు జరుగుతాయి. 

సంతానం కోసం చైత్ర సుద్ధ అష్టమి రోజు ఎం చేయాలి ?

భవాని అష్టమి/ చైత్ర సుద్ధ అష్టమి / అశోక అష్టమి అని కూడా అన్తరు.  శోకము లేనిదీ కాబట్టి అశోకాష్టమి అంటారు . అశోక  పువ్వులు తెచ్చి ఈస్వరుదికి పూజ చేయాలి ఇలా  వారి శోకం పోతుంది . 

విడి పోయిన బార్య బర్త కలవడానికి, పెళ్లి కావటానికి , అన్యోన్యం గా ఉండడానికి

బాలకాండ లో ని 73 సర్గ. పెళ్లి ఆయె వరకు, అన్యోన్యం గా ఉండే వరకు , బార్య బర్త కలిసిబతికే వరకు ఈ సర్గ చదువుకోవాలి. 

తెల్లవారుఝామున దీపం పెట్టుకుని , రాముడికి నమస్కరించి మంచి రోజు చూసుకుని ప్రారంబించాలి. 

పిల్లల కోసం పెద్దలు కూడా పారాయణం చేయవచ్చు. 

అప్పుడే పితికిన ఆవు పాలు నివేదన చేయాలి. 

సంతానం కోసం రామాయణం ఎలా పారాయణం చేయాలి ?

బాల కంద లోని 15, 16 సర్గలు చదవలి. ఈ రెండి ఇంటి లో దసరధ మహారాజు సంతానం కోసం పుత్రా కామేష్టి యాగం చేయటం, యాగ ఫలితంగా పాయసం రావటం దానీ ముగ్గురు రాణులు పాయసం స్వీకరించిన తరువాత గర్భం దాల్చిన తరువాత పిల్లలు పుట్టడం ఉంటుంది. 

ఎప్పుడు పారాయణం చేయాలి ?
ఒక సుభ ముహూర్తం , లేదా జన్మ నక్షత్రం రోజున ప్రారంబించాలి. 

తెల్ల వారుఝామున శ్లోకాలు చదువుకోవాలి. రామాయణ పుస్తకాలకి కూడా హారతి ఇచ్చి పూజ చేయాలి. 20 రోజులు పారాయణం చేయాలి . బార్య బర్త ఇద్దరు చదువుకుంటే మంచిది, లేదా ఒకరు చదివితే ఇంకొకరు విన్న మంచిదే. 

ఇలా చేయటం వలన సంతానం కలుగుతుంది అని ఉమా సంహిత లో కనిపిస్తుంది. 

ఆధ్యాత్మిక జీవితం లో పురోగతి ఎలా సాదించాలి?

1. గురువుని అస్రయించడమే. 

ప్రామానికమయిన పురాణం - గరుడ పురాణం. అందరు ఈ పురాణం అంటే బయపడతారు , లేదా ఎవరయినా చనిపోయినప్పుడు మాత్రమే చదవాలి అనుకుంటారు. గరుడ పురాణం నిత్య చదువు కోవచును. అందులో చెప్పిన మాట ఆద్యాత్మిక జీవితానికి ఉత్తమమయిన మార్ఘం గురువు పాదములే - చెప్పిన వారు కృష్ణం వందే జగద్గురుం. 

కృష్ణుడు , గరుత్మంతుడిని శ్రోత గ చేసుకుని అనీ రంగాలలోను , ఆద్యాత్మిక జీవితమ్ లో పురోగతి సాదించాలి అంటే , మంత్రం రహస్యాలను సాధన చేయాలి అంటే , గురువుని ఆశ్రయించటం కంటే వేరే మార్ఘం లేదు. 

పరమాత్మ మీద తప్ప లౌకికమయిన వాటి మీద ఆసక్తి లేని గురువుని ఎన్నుకో. వ్యక్తీ ప్రమానికుడయి ఉండాలి , పండితుడు అయి ఉండాలి. గురువు పాదాలు ఎవరు గట్టిగా పట్టుకుంటారో వాలు ఈ జన్మలోనే కైవల్యం సాధిస్తారు.

2. తీర్ధ యాత్రలు
3. దానం
4. ధర్మ సత్యాలు పాటించడం
5. అన్ని ప్రాణులలోను పరమాత్మని చూడడం.

ఇంకా చాల ఉన్యి కానీ అవి పురాణాలలో వినడమే . 

నవరాత్రులలో చండి హోమం ఎప్పుడు చేయాలి ?

మహర్నవమి రోజు చండి హోమం చేయాలి. కొంత మంది అష్టమి రోజే చేయాలి. 

మంత్రోపదేశం

మంత్రోపదేశం తీసుకున్న తరువాత మంత్ర సిద్ధి కలగా పోతే ఉపయోగం ఏమి లేదు. ఏదో రోజు 5 చేసాం, 10 చేసాం అంటే ఎవరి కొసం చేస్తునట్టు? అ మంత్రాది దేవత అనుగ్రహం పొందాలి అంటే మంత్ర సిద్ధి కావాలి. మంత్ర సిద్ధి కావాలి అంటే ఎవరెవరు ఏ ఏ మంత్రం ఉపదేశం తీసుకునారో అ మంత్రాని అక్షర లక్షలు జపించాలి. 

నిత్య జపించటమె కాకుండా కొన్ని పార్వతి రోజులు ఉంటాయి. అంటే దేవి మంత్రోపదేశం తీసుకున్నవాలు, నవరాత్రి లో తీవ్రమ్ గ చేయడం, పారాయణాలు చేసుకోవడం. తెల్లవారు ఝామున జపం చేయటం వలన చాల విశేషం .