గృహములోను, పూజాగదిలోనే కాడు, గుడిలోనూ, శుభకార్యాలప్పుడూ….పిల్లల పుట్టిన
రోజుల వేడుకలలోను, క్రొత్త పెళ్లికూతురు
గృహములోకి ప్రవేశించేతప్పుడూ హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య
సూత్రం ఉంది. సుభాకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకేచోట చేరుతారు.
అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు. దానివలన పరిసర
ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరతాయి. కనుక హారతి కర్పూరం
వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగాకు నశిస్తాయి.
ముక్కుకు సంబంధించిన వ్యాధులూ, అంటూవ్యాధులూ ప్రబల కుండా
ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిచేసిన
పోతుందో, అలాగే మనం తెలిసీ
సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం,
పరమార్థం.
ఆధ్యాత్మికం , ఆచారం వ్యవహారం , మంచి చెడు , తప్పు ఒప్పు అనీ మన నిత్య జీవన స్రవంతికి కావలిసిన విశేషాలు